Sharad Yadav meets Rahul Gandhi నితీష్ పార్టీలో లుకలుకలు.. లాలూను వీడని చిక్కులు..

Sharad yadav meets rahul gandhi calls mps meet

rahul gandhi sharad yadav, sharad yadav, rahul gandhi slams nitish, rahul gandhi fires on nitish, rahul on mahagatbandhan, Nitish kumar, Rahul Gandhi, janata dal united, Congress, Mahagathbandhan, Bihar, Chief Minister, lalu prasad yadav, cheating, politics

Sharad Yadav, who has maintained silence on the political developments in Bihar, meets Rahul Gandhi at Jawahar Bhawan.

నితీష్ పార్టీలో లుకలుకలు.. లాలూను వీడని చిక్కులు..

Posted: 07/27/2017 06:42 PM IST
Sharad yadav meets rahul gandhi calls mps meet

బీహార్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఇవాళ అరో పర్యాయం అదే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ సొంత పార్టీలో ట్విస్ట్ బయటకొచ్చింది. నితీశ్ విశ్వాస పరీక్షకు ముందు జేడీయు పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. బీజేపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్లు సమాచారం. అయితే ఈ లుకలుకలను బయటకు పొక్కనీయకుండా పార్టీకి చెందిన మరికొందరు నేతలు వారిని పలు విధాల ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుస్తుంది.

ఆర్జేడీ.. కాంగ్రెస్ స్నేహ హస్తాలను వదులుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్ కుమార్ పై పార్టీ అగ్రనేత శరద్ యాదవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ ఓ వైపు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఆయన మాత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జవహార్ భవన్ లో భేటీ అయ్యారు. బీజేపితో మైత్రిని కొందరు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన రాహుల్ కు వివరించినట్లు సమాచారం. ఇక పార్టీ ఎంపీలతో ఆయన ఇవాళ భేటీ అయిన తరువాత కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.

అయితే తమ పార్టీ సమైక్యంగా ఉందని.. లుకలుకలు వున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ కల్పితమని జేడీయు అజయ్ అలోక్ ఖండించారు. ఈ క్రమంలో బీజేపి కేరళ జేడీయూ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ కూడా… నితీశ్ కుమార్ మిత్రులను మార్చడం.. బీజేపితో మైత్రిని కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యవతిరేకించారు. జేడీయూతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. అవసరమైతే తాను తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫాసిస్టు శక్తులతో పోరాటానికి ఎంత మూల్యాన్ని చెల్లించడానికైనా వెనుకాడేది లేదన్నారు.

ఇదిలావుండగా, కేంద్రంలోని బీజేపి, మరీ ముఖ్యంగా నరేంద్రమోడీ సర్కార్ కావాలని తనను వేధింపులకు గురిచేస్తుందని.. ఈ కక్షపూరిత చర్యలను తాను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతానని చెప్పిన అర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దాణా కుంభకోణం, బినామీ ఆస్తుల కేసులు ఎదుర్కొంటున్న అయనపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్నపుడు రైల్వే హోటల్స్‌ కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish kumar  Rahul Gandhi  sharad yadav  janata dal united  Congress  lalu prasad yadav  Bihar  politics  

Other Articles